ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం ధర (Gold Price Today) మళ్లీ ఒక్కసారిగా ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన డిమాండ్ వల్ల భారతదేశంలో మరోసారి పసిడి ధరలు ఆకాశాన్నంటాయి. ఢిల్లీలో గురువారం రోజున 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.600 పెరిగి రూ.89,450కి చేరింది. మరోవైపు వెండి కూడా ఒక్క రోజులో కిలోకు వెయ్యి రూపాయలు మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,01,200కు చేరింది. మరి ఇవాళ్టి బంగారం, వెండి ధరలు (Silver Rates Today) ఎలా ఉన్నాయో చూద్దామా..?
పెరిగిన పసిడి ధర
దేశవ్యాప్తంగా మరోసారి భారీగా బంగారం, వెండి ధరలు (Silver Rate in Hyderabad) పెరిగాయి. హైదరాబాద్ లో గురువారం రోజున 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.88,580 ఉండగా శుక్రవారం నాటికి రూ.10 పెరిగి రూ.88,590 వద్ద పలుకుతోంది. మరోవైపు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర గురువారం రోజు రూ.81,200 ఉండగా ఇవాళ్టికి పది రూపాయలు పెరిగి రూ.81,210కి చేరింది. ఇక గురువారం కిలో వెండి ధర రూ.1,01,29ఉండగా, శుక్రవారం నాటికి రూ.1101 పెరిగి రూ.1,02,400 కు చేరుకుంది.
నేటి బంగారం ధరలు
- 24 క్యారెట్లు – 10 గ్రాముల పసిడి ధర రూ.88,590
- 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.81,210
- 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,450






