హోలీ ఆడుతున్నారా.. ఐతే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

హోలీ (Holi) రంగుల కేళీ వచ్చేసింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హోలీ పండుగను కలిసిమెలిసి ఆనందంగా జరుపుకుంటున్నారు. బంధువులు, స్నేహితులపై రంగులు చల్లుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా రంగుల్లో మునిగి తేలుతున్నారు. అయితే హోలీ ఆడుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు హోలీ ఆడిన తర్వాత కూడా పలు జాగ్రత్తలు పాటిస్తే చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయని సూచిస్తున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దామా..?

హోలీ ఆడేముందు

హోలీ ఆడేందుకు ప్రతి ఒక్కరు సహజసిద్ధమైన రంగులనే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. హోలీ ఆడే ముందు గోళ్లకు నెయిల్ పాలిష్ థిక్ గా వేసుకుంటే గోళ్లలోకి రంగు వెళ్లకుండా ఉంటుందని తెలిపారు. ఇక రంగులు చల్లుకునేముందు చర్మానికి 30 ఎస్‌పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ (Sunscreen Lotion) తప్పనిసరిగా రాసుకోవాలని చెబుతున్నారు. రంగుల వల్ల చర్మం, జుట్టుపై ఎక్కువ ప్రభావం ఉంటుందని.. హోలీకి ముందు రోజు రాత్రే తలకు నూనె పట్టించి మసాజ్ చేయాలని సూచించారు.

హోలీ ఆడిన తర్వాత పాటించాల్సిన టిప్స్

  1. హోలీ ఆడిన తర్వాత ముఖంపై క్లెన్సర్‌ ఉపయోగించి రంగులు క్లీన్ చేసుకోవాలి. లేదా  శనగపిండి, పాలపొడి, లావెండర్ ఆయిల్ ఒక బౌల్ లో తీసుకుని కలిపి దాన్ని చర్మానికి పట్టించి క్లీన్ చేస్తే రంగులు ఈజీగా తొలగిపోతాయి.
  2. శనగపిండి, ఆలివ్ ఆయిల్, మీగడ, రోజ్‌వాటర్‌లతో తయారు చేసిన పేస్ట్ ను ముఖం, చేతులు, మెడ, కాళ్ల మీద పెట్టుకుని ఆరిన తర్వాత కడిగితే చర్మంపై దద్దుర్లు తగ్గుతాయి.
  3. కళ్లలో రంగులు పడితే నీళ్లతో తరచుగా కడుగుతూ ఉండాలి.
  4. కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, వూసులు కట్టడం, రక్తం కారటం, దురద లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
  5. వాటర్‌ బెలూన్స్‌కు దూరంగా ఉండాలి. వాటిని కళ్లకు తగలనీయకుండా జాగ్రత్తపడాలి.
  6. డాబాలు, మేడలపై, అపార్ట్‌మెంట్ల టెర్రస్‌పై హోలీ ఆడకూడదు.

Related Posts

ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *