Half Day Schools: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచే హాఫ్ డే స్కూల్స్

తెలుగు రాష్ట్రాల్లోని స్కూలు విద్యార్థుల(School Students)కు తీపికబురు వచ్చేసింది. చిన్నారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హాఫ్ డే స్కూల్స్(Half Day Schools) రేపటి నుంచి కొనసాగనున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు(Summer Temperatures)రోజురోజుకీ పెరిగిపోతుండటంతో AP, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ ఒకపూటే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు అన్నింటికీ వర్తించనున్నాయి.

మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు

కాగా తెలంగాణ(Telangana)లో హాఫ్ డే స్కూళ్లు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. అలాగే ఏపీలో ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకూ జరుగుతాయి. ఉక్కపోత, వేడి గాలులకు విద్యార్థుల ఇబ్బందులు పడకుండా.. వారి సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒంటిపూట బడులు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వేసవి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి జూన్ 12 నుంచి 2025-26 విద్యా సంవత్సరం(New Academic Year) ప్రారంభం కానుంది.

Andhra Pradesh Schools Half-Day Schedule Announced 2024

ఈసారి 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు

కాగా ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వేసవి ప్రతాపం అధికంగా ఉంటోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక వడగాలులు ఈ నెల మూడో వారం నుంచి ప్రతాపం చూపించనున్నాయి.

Summer is becoming hotter: IMD predicts above-normal temperatures, longer  heatwaves in April-June - Summer is becoming hotter: IMD predicts above  normal temperatures, longer heatwaves in April June BusinessToday

Related Posts

హైదరాబాద్ లో శానిట‌రీ ప్యాడ్ల ఫ్యాక్ట‌రీపై బీఐఎస్ దాడులు

హైదరాబాద్ నగరంలో ఐఎస్ఐ మార్కు (ISI Mark) లేని శానిట‌రీ ప్యాడ్లు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ ఓ కేంద్రంపై బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (BIS Raids), హైద‌రాబాద్ శాఖ అధికారులు దాడులు నిర్వ‌హించారు. కుషాయిగూడలోని ఓ కేంద్రంలో జ‌రిగిన సోదాల్లో అమ్మ‌కానికి…

TELANGANA : ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి.. ఇలా చెక్ చేస్కోండి

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు (Telangana Inter Results 2025) విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka),…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *