భారతదేశంలో బంగారానికి (Gold Price Today) భారీగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా మగువలకు పసిడి అంటే ఎంతో ప్రియం. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారు ఆభరణాలే. స్తోమతకు తగినట్లుగా మహిళలు శుభకార్యాలకు బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. పసిడి కేవలం ఆభరణమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయిన ఓ ఎమోషన్. ఇక అవసరమైనప్పుడు ఆదుకునే ఓ ఆప్తమిత్రుడు కూడా.
స్వల్పంగా తగ్గిన పసిడి రేట్లు
ఇక పసిడితో పాటు వెండికీ మంచి డిమాండ్ ఉంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు (Silver Price Today) విపరీతంగా పెరిగిపోతున్నాయి. పసిడి రేట్లు రూ.90వేలు దాటగా.. వెండి ధరలు లక్ష రూపాయలు దాటాయి. అయితే గత రెండ్రోజులతో పోలిస్తే దేశంలో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం రోజున 10 గ్రాముల బంగారం ధర రూ 91,250ఉండగా, శనివారం నాటికి రూ.640 తగ్గింది. ప్రస్తుతం పసిడి ధర రూ.90,610 వద్ద పలుకుతోంది. ఇక కిలో వెండి ధర శుక్రవారం రోజున రూ.1,00,940ఉండగా, శనివారం నాటికి రూ.980 తగ్గింది. ప్రస్తుతం దీని రేటు రూ.99,960కు చేరుకుంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు గత రెండ్రోజుల కంటే స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో తగ్గినప్పుడే కాస్త కొనిపెట్టుకుందామనే భావనలో వినియోగదారులు గోల్డ్ షాపులకు బారులు తీరుతున్నారు. ఇక హైదరాబాద్(Gold Price in Hyderabad)లో శనివారం రోజున పది గ్రాముల బంగారం ధర రూ.90,610గా ఉండగా.. కిలో వెండి ధర రూ.99,960 వద్ద పలుకుతోంది. విజయవాడలో పసిడి ధర రూ.90,610.. కిలో వెండి ధర రూ.99,960 గా ఉంది. విశాఖపట్నంలో గోల్డ్ రేటు రూ.90,610.. వెండి ధర రూ.99,960 ఉండగా.. ప్రొద్దుటూరులో పసిడి ధర రూ.90,610, కిలో వెండి ధర రూ.99,960 వద్ద పలుకుతోంది.






