గోల్డ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్. బంగారం ధరలు (Gold Price Today) మరోసారి పెరిగాయి. రూ.90వేలు దాటి సామాన్యులకు అందుబాటులో లేకుండా ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే ఈ సంవత్సరం పసిడి ధర 15 శాతానికిపైగా పెరిగింది. ఇక మరికొద్ది రోజుల్లో కాస్త తగ్గుతుందని భావించేలోగా మళ్లీ పెరిగి షాక్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారానికి భారీ డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
పెరిగిన బంగారం ధర
దేశవ్యాప్తంగా శుక్రవారం రోజున భారీగా బంగారం ధరలు (Gold Rates in Hyderabad) పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 89,840 కి చేరింది. ఇక 22 క్యారెట్స్ పసిడి ధర 10 గ్రాములు రూ. 82,350 పలుకుతోంది. దీనికి ముందు 5 రోజుల్లో 4 రోజులు రేటు తగ్గడం గమనార్హం. ధరలు ఇలా విపరీతంగా పెరిగిపోతుంటే పుత్తడి కొనుగోలు చేసేది ఎలా అని గోల్డ్ లవర్స్ వాపోతున్నారు.
ఇలా అయితే కొనేదెలా?
ఇక రానున్నది వివాహాల సీజన్ (Wedding Season). శుభకార్యాల్లో మహిళలు బంగారు ఆభరణాలు ధరించడం అనేది ఓ సంప్రదాయంగా వస్తోంది. మెడలో గోల్డ్ లేకపోతే అదో పరువు తక్కువగా భావిస్తుంటారు కొందరు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనడం మాత్రం సాధ్యపడేలా కనిపించడం లేదు. దీంతో మధ్యతరగతి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత పెట్టి సామాన్యులు ఎలా కొనేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వెండికి భారీ డిమాండ్
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 82,500 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 89,990 వద్ద విక్రయిస్తున్నారు. బంగారంతో పాటు వెండి (Silver Price Today)కి కూడా భారీగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే లక్ష రూపాయలు దాటిన కిలో వెండి ధర ప్రస్తుతం మళ్లీ పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1.11 లక్షలు ఉండగా.. ఢిల్లీలో రూ.1.02 లక్షల వద్ద పలుకుతోంది.






