దేశంలో బంగారం (Gold Price Today), వెండి ధరలు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అయితే ఇవాళ మాత్రం పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.85,025 ఉండగా, సోమవారం (ఈరోజు) నాటికి రూ.255 తగ్గి రూ.84,770కు చేరింది. ఇక ఆదివారం రోజున రూ.95,542 ఉన్న కిలో వెండి ధర (Silver Price Today).. సోమవారం నాటికి రూ.418 తగ్గి రూ.95,124 వద్ద పలికింది.
ఏయే నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
- హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర – రూ.84,770
- హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.95,124
- విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.84,770
- విజయవాడలో కిలో వెండి ధర రూ.95,124
- విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.84,770
- విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.95,124
- ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.84,770
- ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ.95,124
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం రోజున ఔన్స్ గోల్డ్ ధర 2,798 డాలర్లు ఉండగా.. సోమవారం నాటికి 25 డాలర్లు తగ్గి 2,773 డాలర్ల వద్ద పలుకుతోంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.83 డాలర్లకు చేరుకుంది.






