దేశంలో బంగారం ధరలు (Gold Prices) జెట్ స్పీడులో దూసుకెళ్తున్నాయి. గత ఐదు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు మరో కొత్త మార్క్ ను తాకాయి. శుభకార్యాల సీజన్ ముందుండటంతో ఇప్పుడు పెరుగుతున్న పుత్తడి రేట్లతో వినియోగదారులు భయపడుతున్నారు. ఇలా అయితే బంగారం కొనేదెలా అని వాపోతున్నారు. దేశవ్యాప్తంగా మరోసారి గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలైన హైదరాబాద్ (Hyderabad), విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ. 91,910 పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 84,250గా ఉంది. క్రితం రోజుతో పోలిస్తే వీటి ధరలు ఏకంగా రూ.710, రూ.650 చొప్పున పెరిగాయి.
పసిడితో పోటీగా వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి రేట్లు పరుగు పెడుతున్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.92,060 .. 22 క్యారెట్ల పుత్తడి తులం రేటు రూ.84,400గా ఉంది. ఇక చైన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ. 84,250.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 91,910 వద్ద పలుకుతోంది. బెంగళూరు, ముంబయి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారంతో పాటు పోటీ పడుతున్న వెండి ధరలు (Silver Price) ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబయి కిలో రూ.1,13,000 వద్ద పలుకుతోంది. ఢిల్లీలో రూ. 1,04,000 వద్ద కొనసాగుతోంది.






