గుడ్​ న్యూస్.. భారీగా తగ్గిన LPG సిలిండర్‌ ధర

వినియోగదారులకు గుడ్ న్యూస్. వంట గ్యాస్ సిలిండర్ (LPG Gas Cylinder) పై భారీ తగ్గింపు చోటుచేసుకుంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్​ ధర తగ్గిస్తున్నట్లు  కేంద్ర చమురు సంస్థలు ప్రకటించాయి.  19 కేజీల ఎల్​పీజీ సిలిండర్‌ ధరను రూ.41 తగ్గించింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌ ధర రూ.1,762 వరకు చేరింది.

వాటిలో నో తగ్గింపు

తగ్గించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే, 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. దీంతో వినియోగదారులు కాస్త నిరాశ చెందారు. అయితే పలు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల కింద ఉచిత సిలిండర్లు (Free Cylinder) ఇస్తుండటంతో కొందరు లబ్ధిదారులకు కాస్త ఊరట లభించినట్లు అవుతోంది.

రూ.41 తగ్గింపు

ఇక వరుసగా ఐదు నెలలుగా పెరుగుతూ వచ్చిన వాణిజ్య ఎల్​పీజీ సిలిండర్ ధరలు జనవరి, ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 2025 ఫిబ్రవరి 1వ తేదీన 19 కిలోల ఎల్​పీజీ సిలిండర్ ధర రూ.7 మేర తగ్గగా.. తాజాగా రూ.41 తగ్గి రూ.1,762 వద్ద పలుకుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *