బంగారం(Gold) కొనుగోలు చేయాలనుకునేవారికి స్వల్ప ఊరట దక్కిందని చెప్పొచ్చు. ఇటీవల భారీగా పెరుగుతూ పోయిన రేట్లు ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా దిగొచ్చాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్(US Federal Reserve) సెప్టెంబర్ సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల నడుమ గోల్డ్ రేట్లు రికార్డు గరిష్టాలకు పెరిగిన సంగతి తెలిసిందే. ఇంకా ఇదే సమయంలో యూఎస్ డాలర్(US dollar) వారం కనిష్టానికి పడిపోయింది. వెరసి బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. కానీ తాజాగా మాత్రం.. ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో గోల్డ్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్లో దిగొచ్చింది.
ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
కాగా గురువారం (July 24) హైదరాబాద్(HYD)లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,250 తగ్గి రూ.92,550కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,360 దిగొచ్చి రూ.1,00,970కి చేరింది. ఇక కేజీ సిల్వర్(Silver Rate) ధర రూ. 1,000 తగ్గి రూ.1,28,000గా కొనసాగుతోంది. ఆకాశన్నంటున్న ధరలను చూసి ఆందోళన చెందుతున్న కొనుగోలుదారులకు ఈ రోజు కాస్త రిలీఫ్ దక్కిందని చెప్పవచ్చు. కాగా తెలుగురాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇవే ధరలు ఉన్నాయి.






