
బంగారం(Gold) కొనుగోలు చేయాలనుకునే వారికి రోజురోజుకీ పెరుగుతున్న ధరలు(Rates) చెమటలు పట్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో(International market) నెలకొన్న అనిశ్చితి, రూపాయి విలువ క్షీణించడం(Depreciation of rupee) వంటి కారణాలతో పుత్తడి ధరల పరుగు కొనసాగుతోంది. ఈరోజు (ఆగస్టు 7) హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం ధర రూ.220 పెరిగి రూ.1,02,550కు ఎగబాకింది. 22 క్యారెట్ల పది గ్రాముల ధర కూడా రూ.200 పెరిగి రూ. 94,000కు చేరుకుంది. మరోవైపు, వెండి(Silver) ధర కూడా కిలోకు రూ.1000 లాభపడి రూ. 1,27,000వేలకు చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో(Telugu States)నూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
రూపీ విలువ మరింత పతనం
భారత్(India), కెనడా(Canada), మెక్సికో, చైనా(Chaina)పై అమెరికా టారిఫ్(USA Tariff) విధింపు మన రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా చర్యలు వాణిజ్య యుద్ధానికి దారితీసిన నేపథ్యంలో అమెరికా డాలరు(US Dollar)తో పోలిస్తే రూపాయి విలువ(Rupee Value) 49 పైసలు క్షీణించింది. ఫలితంగా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 87.83గా నమోదైంది. అమెరికా డాలరు బలంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు(Foreign investments) తరలిపోతుండటం వంటి అంశాల కారణంగా రూపాయి బలహీనంగా ట్రేడయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.