తెలుగు రాజకీయ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ‘మయసభ: ది రైజ్ ఆఫ్ ది టైటాన్స్(Maya Sabha: The Rise of the Titans)’ ఈరోజు (ఆగస్టు 7) నుంచి సోనీలివ్(SonyLiv)లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. దేవ కట్టా, కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో ఆది పినిశెట్టి(Aadhi Pinisetty), చైతన్య రావు, దివ్య దత్తా, సాయి కుమార్(Sai Kumar), శ్రీకాంత్ అయ్యంగార్, నాజర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. హిట్‌మెన్ అండ్ ప్రోడోస్ ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌పై నిర్మితమైన ఈ సిరీస్ 1990ల నాటి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగుతుంది. స్నేహం(Friendship) నుంచి రాజకీయ(Political) శత్రుత్వంగా మారిన ఇద్దరు నాయకుల కథను ఈ సిరీస్ ఉత్కంఠభరితంగా చిత్రిస్తుంది.

రాజకీయ డ్రామా, మోసం, అధికార ఆకాంక్షల చుట్టూ..
ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. శక్తిమంతమైన రాజకీయ డ్రామా, మోసం, అధికార ఆకాంక్షల చుట్టూ తిరిగే కథాంశం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సిరీస్‌లో ఆది పినిశెట్టి, చైతన్య రావు(Chaitanya Rao) నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, వారి పాత్రలు కథలోని ఉద్వేగాలను మరింత లోతుగా చూపించాయని అభిమానులు సోషల్ మీడియా(Social Media)లో ప్రశంసిస్తున్నారు. ‘మయసభ’ రాజకీయ థ్రిల్లర్ శైలిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పే అవకాశం ఉందని సినీవిశ్లేషకులు అంటున్నారు.
New Telugu Web Series #Mayasabha Streaming Now on #SonyLIV in Telugu, Hindi, Tamil & Malayalam Audio #MayasabhaonSonyLIV
Directed By – Deva Katta & Kiran Jay Kumar
Starring – #AadhiPinisetty | #ChaitanyaRao pic.twitter.com/24btIcWTBU
— OTT Streaming Updates (@gillboy23) August 7, 2025






