
అంతర్జాతీయంగా వాణిజ్యరంగంలో అనిశ్చిత పరిస్థితుల వల్ల బంగారం ధరలు (Gold Price Today) కొంతకాలంగా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టారిఫ్స్ ఎఫెక్ట్, రష్యా-ఉక్రెయిన్ వార్, హమాస్-పాలస్తీనా వార్‌కు తోడు భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాల నడుమ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంటోంది. దీంతో ఇన్వెస్టర్లు తమ గోల్డ్, స్టాక్స్, షేర్లు, ఇన్వెస్ట్‌మెంట్లను విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇటీవల బంగారం ధరలు ఆల్ టైమ్ హైరేటుకి చేరాయి. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే దాదాపు రూ.3000కు ధరలు దిగివచ్చాయి. మరి శుక్రవారం (ఏప్రిల్ 25) మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర ఎంతంటే?
హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.98,240 వద్ద పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు (Gold Rate) రూ.90,050కి చేరింది. మరోవైపు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,200 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాములు గోల్డ్ రూ.98,340 వద్ద పలుకుతోంది. ఇక కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,10,900కు చేరింది.