
బంగారం ధరలు(Gold Rates) ఇవాళ భారీగా పెరిగాయి. గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన పసిడి రేటు బుధవారం రూ.900కి పైగా పెరిగింది. దీంతో ఇక పుత్తడి ధరలు తగ్గుతాయని భావించిన వినియోగదారులకు నిరాశే ఎదురవుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో గోల్డ్‌కి డిమాండ్ ఏర్పడింది. కానీ ఆకాశన్నంటున్న ధరలను చూసి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ధరలు ఎలా ఉన్నాయంటే..
కాగా ఈ రోజు (ఏప్రిల్ 16న) హైదరాబాద్(HYD)లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.88,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 990 పెరిగి రూ.96,170 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 96,320కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.88, 300గా పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్(Silver Price) ధర రూ.1,10,000గా నమోదైంది. ఇక నిన్నటితో పోలిస్తే రూపీ వ్యాల్యూ(Rupee Value) కాస్త మెరుగుపడింది. దీంతో ఇవాళ ఒక US డాలర్‌కు రూ.85.74గా
ఉంది.