
మనదేశంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలంటే ముందుగా గుర్తొచ్చేది బంగారం (Gold Rates Today). పసిడి లేకుండా ఏ శుభకార్యం జరగదు. అయితే ఈ ఏడాది మొదటి నుంచి పుత్తడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ఇటీవలే గోల్డ్ రేటు రూ.90వేలు దాటింది. స్వల్పంగా తగ్గింది అనుకునేలోపే ఒక్కసారిగా ఆల్ టైమ్ రికార్డు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇక త్వరలోనే బంగారం ధరలు లక్ష రూపాయల వరకు చేరనున్నట్లు సమాచారం.
ఇవాళ్టి గోల్డ్ రేట్లు ఇలా
గత రెండ్రోజుల్లో బంగారం ధర (Gold Price Today) స్వల్పంగా తగ్గుతూ పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగించింది. ఇక గోల్డ్ రేట్లు తగ్గుతాయని భావించిన వారికి మళ్లీ షాక్ ఇస్తూ భారీగా ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ.440 పెరిగి రూ.91,510 మార్క్ తాకింది. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ.400 పెరిగి రూ. 82,500 వద్దకు ఎగబాకింది.
వెండి ధరలు ఇలా
మరోవైపు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారంతో వెండి (Silver Price Today) గట్టిగా పోటీ పడుతోంది. దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి రేటు ఇవాళ ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.1100 పెరిగి రూ.1,13,00 వద్ద పలుకుతోంది. దీంతో బంగారం, వెండి కొనాలంటే ప్రజలు జంకుతున్నారు.