
గత కొద్ది రోజులుగా బంగారం ధరల(Gold Price)కు రెక్కలొచ్చి ఆకాశాన్నంటుతున్నాయి. 10 గ్రాముల పసిడి ధర దాదాపు రూ.90వేలకు చేరింది. US కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బాధ్యత చేపట్టడం, ఆ తర్వాత టారిఫ్ పెంపు ప్రకటనలతో పుత్తడి రేట్లు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. అయితే చాలా రోజుల తర్వాత పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే వార్త ఏంటంటే.. ఇవాళ బంగారం(Gold Rates) ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
రూ. 100 తగ్గిన వెండి ధర
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold Price Today) ఆదివారంతో పోలిస్తే సోమవారం స్వల్పంగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 12 డాలర్ల మేర తగ్గి ప్రస్తుతం 2,985.24 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సిల్వర్ రేటు ఔన్సుకు 33.76 డాలర్ల వద్ద ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 తగ్గి రూ.89,560 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల పసిడి రేటు రూ.100 తగ్గి రూ. 82,1200 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక కేజీ వెండి(Silver)పై రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.1,11,900కు చేరింది.