Fatima Sana: నేను ఇంకా సింగిలే.. విమానంలో వెళ్తుంటే మూర్చ వచ్చింది: బాలీవుడ్ నటి

బాలీవుడ్‌ హీరో విజయ్‌ వర్మ, తమన్నా కొంతకాలం పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లేవారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలియజేసేవారు. కానీ ఉన్నట్టుండి విడిపోయారు. ఆ తర్వాత విజయ్.. బాలీవుడ్ హీరోయిన్‌తో, దంగల్‌ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో (Fatima Sana Shaikh) పలుమార్లు కనిపించడంతో వీళ్లు ప్రేమలో పడ్డారని సోషల్ మీడియా కోడై కూసింది. కానీ ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటోంది ఫాతిమా సనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి మాట్లాడింది. ఇప్పటికీ తాను సింగిలేనని పేర్కొంది. తన పర్సనల్ విషయాలను పంచుకుంది.

అలాంటి వ్యక్తి నా జీవితంలో ఎవరూ లేరు

‘ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ సమాన గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరు చెప్పేది మరొకరు వినాలి. కొన్నిసార్లు ఒకరి కోసం మరొకరు కాంప్రమైజ్‌ అవ్వాలి. మిమ్మల్ని మీరు కోల్పోకుండా మీ అనుబంధాన్ని ముందుకు నడిపించాలి. అప్పుడే ఆ బంధం విజయవంతంగా కొనసాగుతుంది. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఎవరూ లేరు’. మంచివాళ్లు కేవలం సినిమాల్లోనే ఉంటారు అంటూ తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ సింగిల్‌ అని వెల్లడించింది.

షూటింగ్‌కు రమ్మని పిలిచినప్పుడు ఏడ్చేశా..

ఇక తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ.. ‘నాకు మూర్ఛ రోగం (Epilepsy) ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు విమానంలో ఉండగా మూర్ఛ వచ్చింది. దాంతో నన్ను ఎయిర్‌పోర్ట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. అయినా మూర్ఛ తగ్గకపోవడంతో ఎక్కువ డోసు ఇచ్చారు. దానివల్ల నా శరీరం ఎఫెక్ట్‌ అయింది. బెడ్‌రెస్ట్‌ తీసుకోక తప్పలేదు. అప్పుడు నా చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటి షూటింగ్స్‌ క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వచ్చింది. షూటింగ్‌కు రమ్మని పిలిచినప్పుడు బాధ తట్టుకోలేక ఏడ్చేశా. నాకున్న మూర్ఛ వ్యాధి గురించి అందరికీ చెప్పాలని డిసైడయ్యి అందరికీ చెప్పేశా’ అని పేర్కొంది. ఫాతిమా ప్రస్తుతం మాధవన్‌ సరసన ‘ఆప్‌ జైసా కోయ్’ (Aap Jaisa Koi) మూవీలో నటించింది. ఈ చిత్రం జూలై 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఆదిత్యారాయ్ కపూర్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మెట్రో ఇన్‌ డినో’ మూవీలోనూ ఫాతిమా నటించారు. ఈ మూవీ జూలై 4న థియేటర్లలో విడుదలవుతోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *