
తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మద్యం ప్రియులకు(Liquor Lovers) శుభవార్తను అందించింది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో చిన్న స్థాయిలో బీర్(Bear) తయారీ కేంద్రాలైన మైక్రో బ్రూవరీ(Microbreweries)లను స్థాపించేందుకు రాష్ట్ర క్యాబినెట్ అనుమతి తెలిపింది.
ప్రతి 5 కి.మీ.కు ఒక మైక్రో బ్రూవరీ అనుమతి!
ఈ తాజా నిర్ణయం ప్రకారం, నగర ప్రాంతాల్లో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మైక్రో బ్రూవరీ స్థాపనకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఈ దూరం 30 కిలోమీటర్లు గా నిర్ణయించారు. దీంతో ప్రజలు తమ నివాస ప్రాంతాల్లోనే తక్కువ ధరకు, తాజా బీర్‌ను ఆస్వాదించే అవకాశం పొందనున్నారు.
త్వరలో లైసెన్సుల ప్రకటన
మైక్రో బ్రూవరీల కోసం త్వరలోనే లైసెన్సుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. దీనివల్ల రాష్ట్ర ఆదాయం పెరగడమే కాకుండా, మద్యం వినియోగాన్ని నియంత్రించే విధానంలో కూడా ఇది భాగమవుతుందని అధికారులు చెబుతున్నారు.
కఠిన నిబంధనలు.. శానిటేషన్ కచ్చితంగా!
బ్రూవరీల నిర్వహణపై ప్రభుత్వం నిబంధనలను కఠినంగా పాటించనుంది. శుభ్రత, నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో బీర్ తయారీ మాత్రమే కాకుండా, ప్రజలకు సురక్షితంగా సేవలు అందించే విధంగా నియంత్రణలు విధించనున్నారు.