David Warner: వార్న‌ర్‌కు స్పెషల్ గిఫ్ట్‌గా పంప‌నున్న జ‌క్క‌న్న‌.. ఇంతకీ ఏంటో తెలుసా?

ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్(David Warner).. IPLలో స‌న్‌రైజ‌ర్స్‌కు ఆడి, మ‌నోళ్ల‌కు బాగా దగ్గ‌ర‌య్యాడు. అదే స‌మ‌యంలో తెలుగు సినిమా సాంగ్స్, డైలాగ్స్‌పై ఆయ‌న చేసిన రీల్స్‌(Reels), వీడియోల‌తో కూడా బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబ‌లి(Bahubali)’ సినిమాపై ఆయ‌న చేసిన వీడియోలు అప్ప‌ట్లో నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడీ స్టార్ క్రికెట‌ర్‌కు దర్శకధీరుడు రాజ‌మౌళి(SS Rajamouli) బాహుబ‌లి కీరిటాన్ని గిఫ్ట్‌గా పంప‌నున్నారు. భార‌తీయ సినిమాను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబ‌లి’ ప‌దేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మేక‌ర్స్ మ‌రోసారి ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

డేవిడ్ వార్నర్‌కి రాజమౌళి స్పెషల్ గిఫ్ట్ | Director Rajamouli Sends Gift David  Warner | Sakshi

స్పెష‌ల్ గిఫ్ట్ కోసం ఎదురుచూస్తుంటా: వార్నర్

కాగా రెండు భాగాలుగా అల‌రించిన‌ బాహుబలి ఇప్పుడు ‘బాహుబ‌లి: ది ఎపిక్(Baahubali: The Epic)’ పేరుతో ఒకే పార్ట్‌గా రానుంది. ఈ మూవీ అక్టోబ‌ర్ 31న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా వార్న‌ర్ తాను గ‌తంలో ధ‌రించిన బాహుబ‌లి కాస్ట్యూమ్ లుక్స్‌(Bahubali costume looks)ను మ‌రోసారి తాజాగా పంచుకున్నాడు. “కీరిటం ఉన్న ఫొటో బాగుందా? లేదా?” అనే క్యాప్ష‌న్ ఇచ్చాడు. దీనికి జ‌క్క‌న్న రిప్లై ఇచ్చారు. “హాయ్ డేవిడ్‌… మీరు ఇప్పుడు మాహిష్మ‌తి సామ్రాజ్యాని(Mahishmati Empire)కి నిజ‌మైన మ‌హారాజులా త‌యార‌వ్వండి. నేను ఈ కీరిటాన్ని పంపుతున్నాను” అని అన్నారు. ఈ స్పెష‌ల్ గిఫ్ట్(Special gift) కోసం ఎదురుచూస్తుంటాన‌ని వార్న‌ర్ రిప్లై ఇచ్చాడు. అలాగే “మీరు ఈ సినిమాను ఆస్ట్రేలియాలో మ‌రోసారి చూడండి” అని ‘బాహుబ‌లి’ టీమ్ కామెంట్ చేసింది. దీనికి వార్న‌ర్ ఓకే అంటూ థంబ్ సింబ‌ల్‌ పెట్టాడు.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *