హీరో గోపీచంద్ (Gopichand)తో ‘ఘాజీ’ లాంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి ఓ సినిమా రూపొందిస్తున్నారు. ‘#Gopichand33’గా ఇది ప్రచారంలో ఉంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభం కాగా.. నేడు గోపీచంద్ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ ఓ సర్ప్రైజ్ ఇస్తూ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ‘అతడో యోధుడు విప్లవాన్ని రగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు’ అంటూ వీడియోను టీమ్ పంచుకుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ స్పెషల్ గ్లింప్స్లో ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా గోపీచంద్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.






