అకౌంట్ క్లోజ్ అవ్వొదంటే.. వెంటనే రీ-KYC పూర్తి చేయండి.. ఇలా చేస్తే రూ.2.30 లక్షల బెనిఫిట్ పక్కా

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) పథకం అమలులోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఒక ముఖ్య ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఇంకా అనేక జన్ ధన్ అకౌంట్లు KYC (Know Your Customer) పూర్తి చేయలేదని ఆయన తెలిపారు. కాబట్టి, కేవైసీ చేయని అకౌంట్ హోల్డర్లు వీలైనంత త్వరగా రీ-KYC పూర్తి చేయాలని సూచించారు.

గవర్నర్ హెచ్చరిక ప్రకారం, రీ-KYC చేయకపోతే అకౌంట్లు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా మంది రీ-KYC అవసరం గురించి తెలియకపోవడం వల్ల అది చేయలేదని తెలిపారు. కేవైసీ ప్రక్రియను సులభతరం చేయడానికి, ప్రభుత్వ రంగ బ్యాంకులు పంచాయతీ స్థాయిలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారని చెప్పారు. ఈ క్యాంపులు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతాయి. ఇవి కేవలం KYC కోసం మాత్రమే కాకుండా, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, పెన్షన్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాయని చెప్పారు.

రీ-KYC అంటే ఏమిటి?

KYC అంటే Know Your Customer. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కస్టమర్ వ్యక్తిగత వివరాలు, చిరునామా వంటి సమాచారం అప్‌డేట్ చేసుకోవడం. మీరు అడ్రస్ మార్చినా, ఇతర వివరాల్లో మార్పులు వచ్చినా వాటిని బ్యాంకులో నమోదు చేయాలి.

జన్ ధన్ అకౌంట్ ముఖ్య వివరాలు

పథకం ప్రారంభం: 2014 ఆగస్టు – ప్రధాని నరేంద్ర మోదీ

లక్ష్యం: ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి బ్యాంక్ ఖాతా

ఖాతా రకం: జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్

ప్రయోజనాలు:

కనీస బ్యాలెన్స్ అవసరం లేదు

రూ.10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం

డిపాజిట్లపై వడ్డీ

రూపే డెబిట్ కార్డు

రూ.2 లక్షల ప్రమాద బీమా + రూ.30 వేల అదనపు బీమా

అకౌంట్ హోల్డర్ మరణిస్తే, బీమా మొత్తం కుటుంబానికి లభిస్తుంది

జన్ ధన్ అకౌంట్ కలిగిన వారు రీ-KYCను సమయానికి పూర్తి చేస్తే, ఈ ప్రయోజనాలు నిరంతరంగా పొందవచ్చు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *