UPI Users Alert: UPI లావాదేవీలపై ICICI బ్యాంక్ కొత్త ఛార్జీలు.. వివరాలు ఇదిగో!

దేశవ్యాప్తంగా యూపీఐ (UPI) లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి. అయితే, ఇటీవల బ్యాంకులు ఈ సేవలపై రుసుములు విధించడం ప్రారంభించాయి. యస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ తర్వాత, ఇప్పుడు ICICI బ్యాంక్ కూడా ప్రతి UPI లావాదేవీపై ఛార్జీలు వసూలు చేయనుంది. ప్రస్తుతం ఇది Paytm, Google Pay, PhonePe వంటి చెల్లింపు అగ్రిగేటర్లకు వర్తిస్తుంది. కస్టమర్లపై నేరుగా భారం మోపే అవకాశం ఇప్పటివరకు లేదు.

ఆగస్టు 2 నుంచి ICICI బ్యాంక్ వ్యాపారుల UPI లావాదేవీలను ప్రాసెస్‌ చేయడానికి చెల్లింపు అగ్రిగేటర్లపై రుసుము విధించడం ప్రారంభించింది. ICICI బ్యాంక్‌లో ప్రత్యేక ఎస్క్రో ఖాతా ఉన్న అగ్రిగేటర్లకు.. 2 బేసిస్ పాయింట్లు (ప్రతి ₹100 చెల్లింపుకు ₹2), గరిష్టంగా ₹6 వరకు. స్క్రో ఖాతా లేని అగ్రిగేటర్లకు.. 4 బేసిస్ పాయింట్లు (ప్రతి ₹100 చెల్లింపుకు ₹4), గరిష్టంగా ₹10 వరకు.

UPI చెల్లింపులను అంగీకరించే వ్యాపారులకు, వారి ఖాతా ICICI బ్యాంక్‌లో ఉండి, నేరుగా ఆ ఖాతాకు సెటిల్‌మెంట్లు జరిపితే, ఈ రుసుము నుంచి మినహాయింపు లభిస్తుంది. జూలై నెలలోనే దేశంలో 1,947 కోట్ల UPI లావాదేవీలు జరిగాయి – అంటే రోజుకు సగటున 70 కోట్ల ట్రాన్సాక్షన్లు. మొత్తం విలువ ₹25 లక్షల కోట్లకు పైగా చేరింది. ఇంత భారీ లావాదేవీ వాల్యూమ్‌ను నిర్వహించడానికి మౌలిక సదుపాయాలు, NPCI ద్వారా UPI స్విచ్ సౌకర్యం వంటి సేవలకు పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు ఈ ఖర్చును బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు భరించాయి. కానీ ఇప్పుడు బ్యాంకులు ఈ భారం చెల్లింపు అగ్రిగేటర్లపైకి మళ్లిస్తున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *