
భోగి, సంక్రాంతి(Bhogi, Sankranti) పండుగలను పురస్కరించుకొని తెలంగాణ మాజీ సీఎం, BRS అధినేత KCR ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రైతన్న(Farmers) జీవితాల్లో వెలుగులు కొనసాగాలని, పండిన పంటలతో అన్నదాతల ఇళ్లు కళకళలాడాలని ఆకాంక్షించారు. నూతన తెలంగాణ(Telangana) రాష్ట్రంలో వ్యవసాయం(Agriculture) పండుగ కావాలని, పాటి పంటలతో రైతు కుటుంబాలు సంతోషంగా ఉండాలని గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక పథకాలు అందించినట్లు KCR చెప్పారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి పెద్దపీట వేసిన ఘనత BRS ప్రభుత్వానిదే ఆయన ట్వీట్(Tweet) చేశారు.
✳️ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు.
✳️ సంక్రాంతి.. రైతులకు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ.
✳️ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుంది
✳️ దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి, రైతు… pic.twitter.com/u7K1IGBYvy
— BRS Party (@BRSparty) January 13, 2025
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాం..
వ్యవసాయానికి దన్నుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన కులవృత్తులకు గతంలో లేని విధంగా BRS ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, ఆర్థిక సహకారం(Financial Support) సబ్బండ కులాల జీవితాల్లో సంక్రాంతి శోభ నింపిందని కేసీఆర్ అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగ అభివృద్ధికి ఖర్చు చేసిందని వివరించారు. రైతు జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢసంకల్పంతో ముందుకు సాగామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసాయం, BRS హయాంలో పండుగలా మారిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా, రాజీపడకుండా పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు.
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యతగా నాడు అమలు చేసిన కార్యాచరణ పదేళ్ల అనతికాలంలో సత్ఫలితాలనిచ్చిందని వివరించారు. అందులో భాగంగా 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు(Free Current), ప్రాజెక్టులు, కాల్వల ద్వారా సాగునీరు, పంటలకు పెట్టుబడిగా రైతుబంధు(Rythu Bandhu), రైతు కుటుంబాలకు భరోసాగా రైతు బీమా(Rythu Bhima) వంటి పథకాలను పటిష్ఠంగా అమలు చేశామని తెలిపారు.