నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)( NABARD) స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30, 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు:
డేటా సైంటిస్ట్ / ఏఐ ఇంజినీర్ – 02 పోస్టులు
డేటా ఇంజినీర్ – 01 పోస్టు
డేటా సైంటిస్ట్ కమ్ బీఐ డెవలపర్ – 01 పోస్టు
స్పెషలిస్ట్ డేటా మేనేజ్మెంట్ – 01 పోస్టు
అర్హతలు:
అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/బీసీఏ/ఎంసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కూడా తప్పనిసరి.
ఎంపిక విధానం:
అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూకు పిలిచి ఎంపిక చేస్తారు. రాతపరీక్ష ఉండదు.
దరఖాస్తు తేదీ:
చివరి తేదీ: జూన్ 30, 2025
మరిన్ని వివరాలకు:
అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్ www.nabard.org ను సందర్శించవచ్చు.
గమనిక: ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకొని దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.






