
రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం(Governament) ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా తెల్ల రేషన్ కార్డులు(White Ration Cards ) ఇవ్వబడతాయని హామీ ఇచ్చారు. ప్రజలు ఏదైనా దరఖాస్తు చేసుకున్నప్పుడు, అర్హత నిబంధనల మేరకు వారు రేషన్ కార్డు పొందుతారని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని, ఇందుకోసం ఇప్పటికే రూ. 13 వేల కోట్ల ఖర్చు చేసినట్టు ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఇది పేదల భరోసా అని, ప్రభుత్వం వారి ఆహార భద్రత కోసం అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు.
ఈ కార్డుల పంపిణీతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పేద కుటుంబాలకు ఉపశమనం కలగనుందని అంచనా. అలాగే రేషన్ అందక ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఇకపై ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందనున్నాయి. కొత్తగా మంజూరయ్యే రేషన్ కార్డుల ద్వారా పౌరసరఫరాల శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయగలదని ఆశాభావం వ్యక్తమైంది