తెలంగాణలోని గ్రూప్ 2 (Group 2) అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) కీలక ప్రకటన జారీ చేసింది. గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్(Certifiacte Verification) కు షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 27 నుంచి జూన్ 7 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే వారికి సమాచారం అందించామని.. మిగిలిన వివరాల కోసం కమిషన్ వెబ్సైట్ https://www.tspsc.gov.in/ ను సందర్శించాలని కోరింది.
మొత్తం 783 ఖాళీల భర్తీ కోసం..
కాగా TGPSC Group 2 పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana Public Service Commission) 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష నిర్వహించింది. మొత్తం 783 ఖాళీల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 783 Group 2 ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ (Notification)లో భాగంగా 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,50,000 మంది కంటే ఎక్కువ మంది పరీక్ష రాశారు. 33 జిల్లాల్లో 1,368 పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించింది.







