
ఆంధ్రప్రదేశ్(AP)లో గ్రూప్-2 మెయిన్స్(Group-2 Mains) పరీక్ష నిర్వహణపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. అనేక ట్విస్టుల మధ్య APPSC పరీక్ష నిర్వహణకే మొగ్గు చూపింది. దీంతో ఇవాళ (ఫిబ్రవరి 23) రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది. ఇప్పటికే ప్రిలిమ్స్(Prelims) ద్వారా 92,250 మంది మెయిన్స్ రాసేందుకు క్వాలిఫై(Qualify) అయ్యారు. కాగా మార్నింగ్ 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాల(Exam Centers)కు చేరుకోవాలని సూచించింది. నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.
తప్పుడు ప్రచారం నమ్మొద్దు: APPSC
కాగా రోస్టర్ రిజర్వేషన్ల (Roster Reservations) సమస్య తేలేదాకా పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం APPSCకి లేఖ రాసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి.తాజాగా, ఈ ప్రచారంపై ఏపీపీఎస్సీ అధికారికంగా స్పందించింది. ఇప్పడు పరీక్ష వాయిదా వేస్తే హాల్ టికెట్లు(Hall-Tickets) డౌన్లోడ్ చేసుకున్న84,921 మంది నిజమైన అభ్యర్థుల మానసిక, శారీరక స్థితిపై ప్రభావం చూపుతుందని తెలిపింది. అయితే, గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఏ పరిస్థితుల్లోనూ పరీక్షను వాయిదా వేయబోమంది. ప్లాన్ చేసినట్లుగానే పరీక్ష నిర్వహిస్తామని APPSC స్పష్టం చేసింది.