అంతరిక్ష ప్రయోగాల(In space experiments)లో ఇస్రో(ISRO) మరో మైలురాయిని అధిగమించింది. ఏపీలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(SHAAR) నుంచి నేడు ప్రయోగించిన GSLV-F15 ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో ఇస్రో ఈ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన 100వ రాకెట్ GSLV-F15 కావడం విశేషం. ఈ రోజు ఉదయం 6-23 గంటలకు GSLV F-15 రాకెట్‌ని ప్రయోగించింది. రెండవ లాంఛ్ ప్యాడ్ నుంచి రాకెట్(Rocket) నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది. ఇస్రో అభివృద్ధి చేసిన NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. భూమికి 36 వేల కి.మీ ఎత్తున GTO ఆర్బిట్‌లో NVS-02 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు(ISRO Scientists), ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి..
కాగా డాక్టర్ నారాయణన్(Dr. Narayanan) ఇస్రో ఛైర్మన్(Chairman)గా బాధ్యతలు చేపట్టాక ఇది మొదటి ప్రయోగం. దాదాపు 27 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం బుధవారం ఉదయం సరిగ్గా 6.23 గంటలకు GSLV F-15 రాకెట్‌ని ప్రయోగించారు. రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది. భూమికి 36,000KM ఎత్తున GTO ఆర్బిట్‌లోకి NVS-02 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. భారత భూభాగంపై సముద్ర తీరానికి 1500 కి.మీ మేర మెరుగైన నావిగేషన్ సిస్టం(Navigation system) అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం. అమెరికా తరహాలో GPS, వ్యవసాయం, అత్యవసర సేవలు, విమానాల రవాణా, మొబైల్ లొకేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఈ ఏడాది మరో రెండు డాకింగ్ ఉపగ్రహాల(Docking Satellites)ను ఇస్రో నింగిలోకి పంపనుంది.
Lift off of GSLV F15 carrying NVS-02🚀 #ISRO #GSLVF15 #NAVIC pic.twitter.com/hdfMDVdOaH
— ISRO InSight (@ISROSight) January 29, 2025








