IPL 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్(GT vs LSG) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన గుజరాత్ కెప్టెన్ గిల్(Gill) తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ గుజరాత్‌కు చాలా కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్.. అలాగే ముందుకు వెళ్లాలంటే ఇవాల్టి మ్యాచ్ కూడా గెలవాలి.
పరువుకోసం లక్నో..
ఒకవేళ ఓడితే మొదటి స్థానం నుంచి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మొదటి స్థానంలో ఉన్న జట్టుకు.. అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. నాకౌట్ స్టేజీలో ఓడినా ఒక ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే మళ్లీ అదే.. మొదటి స్థానంలో నిలుస్తుంది. లక్నో గెలిచేందుకు కసరత్తు చేస్తోంది. రూ.27 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన పంత్(Rishabh Pant) ఈ మ్యాచ్లో నైనా మెరుస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తుది జట్లు ఇవే..
Lucknow Super Giants: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(Wk/C), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, విలియం ఒరూర్కే
Gujarat Titans: శుభమాన్ గిల్(C), జోస్ బట్లర్(Wk), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
GT Impact bench: Sai Sudharsan, Anuj Rawat, Mahipal Lomror, Washington Sundar, Dasun Shanaka!
LSG Impact Bench: Akash Singh, M Siddharth, Ravi Bishnoi, David Miller, Arshin Kulkarni! #IPL2025 #GTvsLSG pic.twitter.com/IK1JzjTTzt— OneCricket (@OneCricketApp) May 22, 2025






