Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. ఏం చేశాడంటే?

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Alikhan)పై హత్యాయత్నం ఉదంతం మరవక ముందే.. మరో బాలీవుడ్ సూపర్ స్టార్ ఇంట్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)కు ముంబైలోని బాంద్రాలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోకి మే 20 రాత్రి 23 ఏళ్ల యువకుడు చొరబడి(Illegally Enters), సల్మాన్‌ను కలవాలని నానా హంగామా చేయడంతో సెక్యూరిటీ(Security) అతన్ని బలవంతంగా బయటకి పంపింది. అదేరోజు రాత్రి మరోసారి ఆ యువకుడు కారు వెనకాల నక్కి ఇంట్లోకి ప్రవేశించడంతో సెక్యూరిటీ అడ్డుకొని బాంద్రా పోలీసుల(Bandra Police)కు అప్పగించారు.

అతను సల్మాన్ అభిమాని: పోలీసులు

ఆ యువకుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జితేంద్ర కుమార్‌(Jitendra Kumar)గా గుర్తించారు. అతను సల్మాన్ ఖాన్ అభిమాని(Fan) అని, సల్మాన్‌ను కలవడానికి ప్రయత్నించాడని, ఎటువంటి ఆయుధాలు అతని వద్ద లేవని పోలీసుల విచారణలో తేలింది. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi Gang) నుంచి బెదిరింపులు, 2024 ఏప్రిల్‌లో సల్మాన్ ఇంటివద్ద కాల్పుల ఘటన తర్వాత ప్రభుత్వం ఆయనకు Y+ సెక్యూరిటీని నియమించింది. అయినా ఇలాంటి ఘటన జరగడం సల్మాన్ భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోందని పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు.

తాజాగా మహిళ కూడా..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోకి ఓ మహిళ అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి కలకలం రేపింది. సల్మాన్ ఖానే తనను రమ్మన్నారని ఆమె చెప్పగా, అది నిజం కాదని తేలడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ ఘటన సల్మాన్ ఇంటి వద్ద భద్రతా లోపాలను మరోసారి చర్చనీయాంశం చేసింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *