
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్‌లో 5వ మ్యాచ్ నేడు గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య జరగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేయనుంది.
9 నెగ్గి.. ఏడింటిలో ఓడింది
కాగా GT తన సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 9 గెలిచి, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ మైదానంలో గుజరాత్ జట్టు తన తొలి IPL టైటిల్‌ను కూడా గెలుచుకుంది. 2022లో జరిగిన తొలి సీజన్‌లో ఆ జట్టు ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR)ను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. అటు గత ఏడాది కేకేఆర్‌కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్.. ఈ సారి పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
తుది జట్లు ఇలా..
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(W), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (W), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (C), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.