తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ హీరోయిన్ హన్సిక (Hansika) బాంబే హైకోర్టు(High Court of Bombay)ను ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం క్వాష్ పిటిషన్(Quash petition) దాఖలు చేసింది. తన సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె తల్లిపై గతంలో కేసు(Case) నమోదైన సంగతి తెలిసిందే. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ SM మోదక్‌లతో కూడిన ధర్మాసనం హన్సిక సోదరుడి భార్యకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3కి వాయిదా వేసింది.
ముగ్గురిపైనా గృహ హింస కేసు
అయితే హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ(Prashant Motwani).. TV నటి ముస్కాన్ జేమ్స్(Muskan James)ను 2020లో వివాహం చేసుకున్నాడు. అయితే వీరు కొన్ని కారణాల వల్ల 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో హన్సిక సహా సోదరుడు ప్రశాంత్, తల్లి జ్యోతి(Jyothi)లపై ముస్కాన్ గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరిలో హన్సిక, జ్యోతిలకు బాంబే సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హన్సిక, ఆమె తల్లి తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
![]()
కాగా హన్సిక 2007లో అల్లు అర్జున్(Allu Arjun) సరసన దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కంత్రి, మస్కా, బిల్లా, కందిరీగ, పవర్, 105 మినిట్స్ వంటి సినిమాల్లో నటించింది. ఇక 2024లో గార్డియన్ అనే తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలోనూ హన్సిక నటించింది.







