తెలంగాణలోని రాజ్‌భవన్(Raj Bhavan in Telangana)లో హార్డ్ డిస్క్(Hard Disk)ల చోరీ కలకలం రేపింది. గవర్నర్ ఇలాకా నుంచి 4 హార్డ్ డిస్క్‌లు మాయమయ్యాయి. CCTV ఫుటేజీల ద్వారా గుర్తించిన అధికారులు పంజాగుట్ట పోలీసుల(Police)కు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ ఇంజినీర్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. ఈ చోరీ వెనుక అసలు కారణం ఏంటి? హార్డ్ డిస్క్‌లలోని సమాచారం ఏమిటి? ఈ దొంగతనానికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈనెల 14నే చోరీ జరిగినట్లు అనుమానం
కాగా, ఈ నెల 14న చోరీ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. హెల్మెట్(Helmet) ధరించి కంప్యూటర్ రూమ్‌లోకి వచ్చి ఈ దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. రాజ్‌భవన్‌లోని సుధర్మ భవన్‌లో మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ రూమ్(Computer Room)లోకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అసలు ఈ హార్డ్ డిస్క్‌లను శ్రీనివాస్ ఎందుకు చోరీ చేశాడు.. దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. నిత్యం హై సెక్యూరిటీ(High security), సీసీ కెమెరాల నిఘాలో ఉండే రాజ్‌భవన్((Raj Bhavan)లో చోరీ(theft) జరగడం సంచలనంగా మారింది.






