Mana Enadu : ఏపీ డిప్యూటీ సీఎంగా నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉంటున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. కాస్త గ్యాప్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా వస్తున్న సినిమాయే హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ అప్డేట్ రివీల్ చేశారు. అదేంటంటే..?
హరిహర వీరమల్లు కౌంట్ డౌన్
150 days to go! #HariHaraVeeraMallu
UNSTOPPABLE FORCE, UNBREAKABLE SPIRIT
Stay tuned for the first single announcement poster from @HHVMFilm this evening pic.twitter.com/zgy53gWmvh
— Hari Hara Veera Mallu (@HHVMBookings) October 29, 2024
హరిహర వీరమల్లు సినిమా 150 రోజుల్లో థియేటర్లోకి రానుందంటూ కౌంట్ డౌన్ (Hari Hara Veeramallu) పోస్టర్ ను విడుదల చేశారు. రెండు డిఫరెంట్ షేడ్స్‌లో ఉన్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అన్‌స్టాపబుల్ ఫోర్స్.. బద్దలు కొట్టలేని స్పిరిట్.. ఇవాళ సాయంత్రం ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కోసం వేచి ఉండండి.. అంటూ పోస్టర్ కింద ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చి అభిమానుల్లో ఆసక్తి పెంచింది.
హరిహర వీరమల్లు నటులు వీళ్లే
ఇక సినిమా సంగతికి వస్తే హరిహర వీరమల్లులో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్(Nidhi Agarwal) పవన్ కల్యాణ్ కు జోడీగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
900 మందితో అదిరిపోయే సీన్
ఇక హాలీవుడ్ లెజెండరీ స్టంట్ డైరెక్టర్ నిక్ పవెల్ (Nick Powell) పర్యవేక్షణలో యుద్ద వీరుడు హరిహరవీరమల్లు ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారట. పవన్ కల్యాణ్‌తో పాటు 900 మంది నటీనటులు, సిబ్బంది చిత్రీకరణ పాల్గొన్నారు. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం అని గతంలో చిత్రబృందం ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే.






