First Day Collections: హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్ సెన్సేషన్.. పవన్ కెరీర్‌లోనే అద్భుత రికార్డు!

పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu ) ఎట్టకేలకు థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫస్టాఫ్ మెరుగ్గా నడవగా, సెకండాఫ్‌లో VFX మరియు గ్రాఫిక్స్ చాలా చోట్ల నిరాశపరిచాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే కీరవాణి సంగీతం, క్లైమాక్స్ పార్ట్ మాత్రం సినిమాను నిలబెట్టాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. క్రిష్(Krish Jagarlamudi) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బుధవారం రాత్రే ప్రీమియర్ షోలు ప్రదర్శించగా, టికెట్ రేట్లు పెరిగినప్పటికీ మంచి స్పందన వచ్చింది.

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత వీరమల్లు మొదటి సినిమా కావడంతో అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రతి అప్‌డేట్‌కి సోషల్ మీడియాలో హైప్ తారాస్థాయికి చేరింది. ఈ క్రేజ్‌ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు, ఓపెనింగ్ డే షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి.

17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ యోధుడి పాత్రలో అదరగొట్టాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. క్రిష్ జాగర్లమూడి((Krish Jagrlamudi)) విజన్‌కు, సినిమా విజువల్ ప్రెజెంటేషన్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలైన రోజు నుంచే భారీ వసూళ్లు(First Day Collections) సాధించింది. దేశవ్యాప్తంగా రూ.31.50 కోట్లు రాబట్టగా, ప్రీమియర్ షోల ద్వారా రూ.12.7 కోట్లు వసూలయ్యాయి. మొత్తం కలిపి మొదటి రోజే రూ.43.8 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. తెలుగు వెర్షన్‌కు సగటు ఆక్యుపెన్సీ 57.39%గా నమోదైంది. ఈ మేరకు ‘హరిహర వీరమల్లు’ పవన్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అనే రికార్డ్‌ను సొంతం చేసుకుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *