
పవర్ స్టార్ పవన్ కల్యాణ్( Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)’. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్(Promotions) కార్యక్రమాలను వేగవంతం చేశారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం వచ్చే వారాంతంలో ఒక భారీ ప్రీ-రిలీజ్ వేడుక(Pre Release Event)ను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుక ద్వారా సినిమాపై అంచనాలను మరింత పెంచాలని నిర్మాతలు(Producers) భావిస్తున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం
ఈ మేరకు తిరుపతిలోని SVU తారకరామ క్రీడా మైదానంలో ఈ నెల 8న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) నిర్వహించనున్నారు. దీనికోసం పవన్ కల్యాణ్ 7వ తేదీన తిరుపతి చేరుకోనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, చెన్నైలో ఇటీవల సాంగ్ లాంచ్ ఈవెంట్(Song launch event)ను నిర్వహించిన మేకర్స్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్నారు.
మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో..
17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చారిత్రక యాక్షన్ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, ఎ.ఎం. జ్యోతి కృష్ణ(Krish Jagarlamudi, A.M. Jyothi Krishna) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agarwal) నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి వంటి ప్రముఖ తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత MM కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.
Get Ready for Powerstar biggest release ever in Germany 💥💥
Bookings will open very soon🦅🦅🦅🦅#HariHaraVeerMallu Germany release by @3REALMSEnt @4SeasonCreation @PharsFilm @PawanKalyan @AMRathnamOfl @MegaSuryaProd @HHVMFilm @PawanismNetwork @PK_Addicts @TrendPSPK pic.twitter.com/vBsLJFKmZz
— 3REALMS Entertainment (@3REALMSEnt) June 2, 2025