‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై హరీష్ శంకర్ కీలక అప్ డేట్.. పవన్ సినిమా షూటింగ్ తేదీ ఖరారు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను సంతోషపెట్టే మరో అప్‌డేట్ విడుదలైంది. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాస్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustaad Bhagat Singh) త్వ‌రలో తిరిగి సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలో బెంగళూరు బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది.

పవన్ కళ్యాణ్ రాజకీయ, సినీ రంగాల్లో బిజీగా ఉండడంతో ఈ చిత్రం గత కొన్ని నెలలుగా హోల్డ్‌లో ఉంది. అయితే తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హరీష్ శంకర్, మీడియాతో మాట్లాడుతూ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెగ్యులర్ షూటింగ్ జూన్ రెండో వారంలో ప్రారంభమవుతుందని వెల్లడించారు. షూటింగ్ ప్రారంభానికి ముందే స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం తిరుమలకు వచ్చానని తెలిపారు హరీష్ శంకర్.

ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్–హరీష్ శంకర్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ భారీ విజయాన్ని సాధించగా, ఇప్పుడు అదే మ్యాజిక్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ద్వారా మళ్లీ పునరావృతమవుతుందన్న అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు దర్శకుడు దశరథ్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సినిమా టీమ్‌లో అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ సమకూరుస్తున్నారు. ఈ సినిమా 2026లో విడుదల అయ్యే అవకాశముండగా, ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో కూడా ఈ ప్రాజెక్టుపై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *