ఇంగ్లండ్(England) గడ్డపై హర్మన్ సేన అదరగొట్టింది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీమ్ఇండియా(Team India) ఘనవిజయం సాధించింది. ఆతిథ్య జట్టుపై 13 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ కొట్టి.. మూడు వన్డేల సిరీస్(3 Macth ODI Series)ను 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపైలో వరుసగా రెండో సిరీస్‌ను గెలుచుకుంది. ఇదే టూర్‌లో తొలుత ఐదు మ్యాచుల టీ20 సిరీస్(5Match T20 Series)ను 3-2తో టీమ్ఇండియా నెగ్గింది. దీంతో తొలిసారి ఇంగ్లిష్ గడ్డపై రెండు వరుస సిరీస్‌లు నెగ్గి చరిత్ర సృష్టించింది. కాగా ఈ విజయాలు రాబోయే ప్రపంచకప్(World Cup 2025)కు భారత్‌లో ఆత్మవిశ్వాసం నింపనున్నాయి.
సూపర్ సెంచరీతో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్
కాగా ఈ వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (84 బంతుల్లో 102, 14 ఫోర్లు) సెంచరీతో చెలరేగింది. జెమిమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 50), స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ (45 రన్స్ చొప్పున), రిచా ఘోష్ (18 బంతుల్లో 38) రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 318/5 భారీ స్కోరు సాధించింది. హర్మన్‌ప్రీత్, జెమిమా ఇద్దరూ 110 పరుగుల భాగస్వామ్యం అందించడంతో భారత్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
ఇంగ్లండ్ జట్టులో ఆ ఇద్దరు మినహా
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 8/2తో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో నట్ సివర్-బ్రంట్ (98), ఎమ్మా లాంబ్ (68) 162 పరుగుల భాగస్వామ్యంతో పోరాడారు. అయితే, యువ పేసర్ క్రాంతి గౌడ్ (6/52) అద్భుత బౌలింగ్‌తో ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను 305 పరుగులకు కట్టడి చేసింది. దీప్తి శర్మ 2, శ్రీ చరణి 1 వికెట్ తీసి తీశారు. హర్మన్‌ప్రీత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ‘సిరీస్’ అవార్డులను అందుకుంది. కాగా ఈ మ్యాచులో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమష్టి పోరాటాన్ని ప్రదర్శించింది. ఇది రాబోయే ఆస్ట్రేలియా సిరీస్, ప్రపంచకప్‌కు పాజిటివ్‌గా మారనుంది.
England Women vs India Women, ODIs ⚡💥🏏⚾
PLAYER OF THE SERIES
Harmanpreet KaurIndia Women seal the ODI series 2-1 against England Women!#ENGVIND #ENGvsIND #INDVENG #ENGWVINDW #ODI pic.twitter.com/Eb2i3xY9om
— IF SPORTS (@IFSPORT_) July 22, 2025






