ManaEnadu:హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. వెంటనే వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. 90 ఆసెంబ్లీ నియోజకవర్గాలున్న హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 46 స్థానాల్లో విజయం సాధించాలి. మెజార్టీ సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపాయి.
రిపబ్లిక్ మ్యాట్రిజ్: కాంగ్రెస్: 55-62, బీజేపీ 18-24, ఐఎన్‌ఎలడీ+బీఎస్పీ: 3-6, జేజేపీ: 0-3, ఇతరులు: 2-5
పీపుల్స్ పల్స్ : కాంగ్రెస్ 55 స్థానాలు.. బీజేపీ 26, ఐఎన్‌ఎల్‌డీ 2-3, జేజేపీ 0-1, ఇతరులు 3-5 స్థానాలు.
దైనిక్ భాస్కర్: కాంగ్రెస్: 44-54, బీజేపీ : 19-29, జేజేపీ: 0-1, ఐఎన్‌ఎల్‌డీ 1-5, ఇతరులు 4-9
ధ్రువ్ రీసెర్చ్: కాంగ్రెస్: 57-64, బీజేపీ : 27-32, ఇతరులు: 5-8
జమ్మకశ్మీర్ ఎగ్జిట్ పోల్స్
ఇక దాదాపు పదేళ్ల తర్వాత జరిగిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. మొత్తం 90 స్థానాలకు గానూ 3 విడతల్లో పోలింగ్ జరగగా.. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు సాధించొచ్చని ‘పీపుల్స్ పల్స్ రీసెర్చ్’ సంస్థ అంచనా వేసింది. బీజేపీ – 23-27 స్థానాలు; పీడీపీ 7-11 స్థానాలు; ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు తెలిపింది.
జమ్ముకశ్మీర్ లో కూటమి సర్కార్
బీజేపీ -25, కాంగ్రెస్ -12, ఎన్సీపీకి – 15, ఇతరులు -7 సీట్లు గెలుచుకుంటారని ‘రిపబ్లిక్ మ్యాట్రిజ్’.. ఎన్‌సీకి 33-35, కాంగ్రెస్‌కు 13-15, బీజేపీ 23-27, పీడీపీ 7-11 సీట్లు, ఇతరులకు 4-5 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్-సౌత్‌ఫస్ట్ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్, ఎన్‌సీ కూటమికి 34 నుంచి 40, బీజేపీకి 20-25, పీడీపీకి 4-7, ఇతరులకు 12 నుంచి 16 స్థానాలు వస్తాయని దైనిక్ భాస్కర్ పేర్కొంది.






