
హైదరాబాద్ నగరం(GHMC)లో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరించిన నేపథ్యంలో హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. 13, 14, 15 తేదీల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని హైడ్రా(Hydra) నగర ప్రజలను హెచ్చరించింది. ఈ మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
⚠️ Hyderabad Weather Alert ⚠️
Heavy rains are expected over the next 4 days! 🌧️⛈️
Plan your travel wisely and avoid unnecessary trips to stay safe. 🚫🚗HYDRAA – DRF Helpline : 040 29560521 | 9000113667 | 9154170992#HyderabadRains #HYDRAA pic.twitter.com/xCvAcTqohP
— HYDRAA (@Comm_HYDRAA) August 12, 2025
మేడ్చల్ జిల్లాతో పాటు సైబరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని హైడ్రా వెల్లడించింది. 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే మూడు రోజులు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.