AP Rain News: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన

శీతాకాలంలోనూ వరుణుడు ఏపీ(Andhra Pradesh)ని వదలడం లేదు. నైరుతి బంగాళాఖాతం(Southwest Bay of Bengal)లో తీవ్ర అల్పపీడనం మరింత బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) పేర్కొంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడిచింది. దీంతో రానున్న 12 గంటల్లో అది తీవ్ర వాయుగుండం(Extreme weather)గా మారి కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని హెచ్చరించింది. అలాగే మరో 24 గంటలపాటు వాయుగుండం కొనసాగుతూ ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు(Heavy Rains) కురుస్తాయని చెప్పింది. రైతులు(Formers) పంటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే మత్స్యకారులు(Fishermen) వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.

వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష

అల్పపీడనం ప్రభావంతో శనివారం (DEC 21) పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురుస్తాయని వెల్లడించింది. అదే సమయంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, YSR కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తాజా బులెటిన్‌లో పేర్కొంది. అటు కళింగపట్నం-మచిలీపట్నం వరకూ అన్ని పోర్టుల్లోనూ 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర హోంమంత్రి అనిత(Home Minister Anitha) వర్షాలపై అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు హెచ్చరించే సందేశాల ద్వారా ప్రజలు, రైతులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *