TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి(Tirumala Vankateshwara Swamy Temple) వారి దర్శనానికి భక్తులు(Devotees) పోటెత్తారు. వీకెండ్‌కు తోడు వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. పిల్లాపాపలతో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. ఇవాళ (ఏప్రిల్ 26) ఉదయం 11 గంటల వరకూ 26 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని TTD అధికారులు తెలిపారు. మరోవైపు అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. గరుడ కూడలి వరకు నిలిచిపోయాయి.

 

రద్దీ ప్రదేశాల్లో పటిష్ఠ భద్రత

 

కాగా శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, రూ.300 స్పెషల్ దర్శనాని(Special Entry Darshan)కి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించారు. ఇదిలా ఉండగా శుక్రవారం 64,536 మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. 30,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు TTD తెలిపింది. మొక్కుల రూపంలో భక్తులు రూ.3.37 కోట్లు హుండీ(Hundi)లో స్వామి వారికి సమర్పించుకున్నారని వెల్లడించింది. కాగా పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో తిరుమల తిరుపతిలో భారీగా పోలీసులు మోహరించారు. ఉగ్రకదలికలు ఉన్నాయన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) ఆదేశాల మేరకు పోలీసులు ప్రతిచోటా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *