Mana Enadu: ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగాడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaraam). ఆయన నటించిన మూవీ ‘క (KA)’. సుజిత్, సందీప్ ద్వయం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. దీపావళి కానుకగా ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్(Pre-Release Event) ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ భార్య రహస్య(Rahasya) మాట్లాడుతూ.. మా ఆయన కోసం ఈ సినిమా చూడాలని కోరారు. ఎంటర్‌టైనర్ కోసమో, ఆఫీసులో బాస్ పెట్టే టెన్షన్ నుంచి రిలీఫ్ కావడానికో ‘క’ మూవీని చూడండి కచ్చితంగా మీ డబ్బులు వసూలు అవుతాయన్నారు.
కూలి పని చేసుకునే స్థాయి నుంచి ఇక్కడి వరకు వచ్చా: కిరణ్
తనను ట్రోల్స్(Trolls) చేస్తున్నవారికి హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaraam) కౌంటర్ ఇచ్చారు. ‘క’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ‘నా సినిమాలు నేను చేసుకుంటుంటే నాపైన ట్రోలింగ్స్ ఏంటి. ఓ సినిమాలో నన్ను ట్రోల్ చేశారు. నేను ఊళ్లో కూలి పని చేసుకునే స్థాయి నుంచి ఇక్కడి వరకు వచ్చా. అసలు కిరణ్ అబ్బవరంతో మీకేంటీ ప్రాబ్లమ్. నేను ఎదగకూడదా?.. సినిమాలు తీయకూడదా?. అదేపనిగా నన్ను టార్గెట్(Target) చేస్తున్నారు?’ అని ఆయన ఫైర్ అయ్యారు.
ట్రోలింగ్‌పై భయపడాల్సిన పని లేదు: నాగ చైతన్య
తనను ట్రోల్స్ చేస్తున్నారంటూ హీరో కిరణ అబ్బవరం అన్న మాటలపై హీరో నాగ చైతన్య(Naga Chaitanya) స్పందించారు. ‘నేను ఇండస్ట్రీకి ఒక సపోర్ట్‌తో వచ్చాను. కిరణ్ లాంటి వాళ్లు పడ్డ కష్టం నాకు లైఫ్‌లో తెలియకపోవచ్చు. కిరణ్ నీలో శక్తి ఉంది. ట్రోల్స్ చేసేవాళ్ల చేతిలో కీబోర్డు మాత్రమే ఉంటుంది. వాళ్ల బుర్రలో ఏమీ ఉండదు. ట్రోలింగ్‌పై భయపడాల్సిన పని లేదు. ఆ స్థాయిని కిరణ్ దాటేశాడు’ అని ‘క’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చైతూ అన్నారు.







