టాలీవుడ్ లోకి మరో నందమూరి వారసుడు.. ఎవరంటే?

Mana Enadu : నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. నందమూరి హరికృష్ణ (Hari Krishna) మనవడు, జానకిరామ్‌ కుమారుడు.. తారక రామారావు హీరోగా తెలుగు తెరపై కనువిందు చేయబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు వై.వి.ఎస్‌.చౌదరి (yvs chowdary) తారక రామారావును పరిచయం చేస్తున్నారు. ‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ పతాకంపై వైవీఎస్ సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆ అదృష్టం నాకే దక్కింది

ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వై.వి.ఎస్‌.చౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పంచుకున్నారు. ఈ సందర్భంగా న్యూ హీరో తారక రామారావు(Taraka Rama Rao)ని పరిచయం చేశారు. తారక రామారావును పరిచయం చేసినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. హరికృష్ణతో సినిమాలు తీసే అదృష్టం తనకు దక్కిందని.. ఇప్పుడు ఆయన మనవడిని కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నానని వై.వి.ఎస్ తెలిపారు.

ఎన్టీఆర్ నా ప్రాణం

“ఎన్టీఆర్‌ (NTR) అనే పేరు నా ప్రాణం. అది నాకు ఓ తారకమంత్రం. నేను బ్రేక్ తీసుకున్నప్పుడు కూడా ఈ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి బర్త్ డే కు పోస్టులు పెడతాను. ఆ కుటుంబంలో నాకు అందరూ ఒకటే. ఈ సినిమా 1980 నేపథ్యంలో వస్తుంది. నేను కొత్త హీరోతో సినిమా చేయాలనునుకుంటున్న సమయంలో ఎన్టీఆర్‌ను చూశాను. వాళ్ల అమ్మ కూడా ఎంతో అండగా ఉన్నారు. అలాగే అతడి బాబాయిలు, తాతయ్యలు అందరూ అంగీకరించారు.” అని వైవీఎస్ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాతో కమ్ బ్యాక్

గతంలోనూ వైవీఎస్ చౌదరి చాలా మంది నటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వెంకట్, చాందిని, చందు, ఆదిత్య ఓం, అంకిత, రామ్, ఇలియానా(Ileana), సాయి ధరమ్ తేజ్, సయామీ ఖేర్ లను ఆయన ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. వీరంతా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. ఇక వైవీఎస్ చౌదరి ‘సీతా రాముల కల్యాణం చూదము రారండి’, ‘యువరాజు (Yuvaraju)’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’, ‘దేవదాస్‌’ వంటి హిట్ మూవీస్ తీశారు. ఆయన చివరగా తీసిన ‘రేయ్‌’ మూవీ ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ మూవీతో మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *