
యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలన్న అభిప్రాయాన్ని నాగార్జున వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేదే తమ కోరిక అని నాగార్జున తెలిపారు.
నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను రేవంత్ సర్కార్ కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ విషయంపై నాగార్జున న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. అక్రమించిన స్థలంలో నిర్మించడంతోనే కూల్చివేశామని రేవంత్ సర్కార్ ఆ సమయంలో స్పష్టం చేసింది. కాంగ్రెస్ నాయకులు సైతం ఈ విషయంపై అనేక సార్లు నాగార్జునపై విమర్శలు గుప్పించారు.
CM రేవంత్ తో జరిగిన టాలీవుడ్ పెద్దల భేటీలో సీనియర్ హీరో నాగార్జున పాల్గొన్నారు. రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేదే తమ కోరిక అని నాగార్జున తెలిపారు.