High Alert: హైదరాబాద్, ముంబైలో హైఅలర్ట్.. భద్రత పెంచిన పోలీసులు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్‌(Hyderabad)తో సహా తెలంగాణలోని కీలక నగరాల్లో హైఅలర్ట్(High Alert) విధించారు. కేంద్ర నిఘా వర్గాల(Central Intellegence Reports) హెచ్చరికల మేరకు రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబై(Mumbai) నగరంతో పాటు దాని తీర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్ఠం చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడి అనంతరం మహారాష్ట్ర హోంశాఖ(Maharastra Home Ministry) అప్రమత్తమైంది. సముద్ర మార్గంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని ముంబై పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ముంబై తీర ప్రాంతంలో భద్రతను పెంచారు.

Hyderabad police on high alert ahead of Independence Day-Telangana Today

రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. అస్సాం ఎమ్మెల్యే అరెస్టు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనలో పాకిస్థాన్‌(Pakistan)ను సమర్థిస్తూ, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై AIUDF పార్టీకి చెందిన MLA అమినుల్ ఇస్లాం(Aminul Islam)ను అసోం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయనపై దేశద్రోహం అభియోగాలు మోపారు. ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 152/196/197(1)/113(3)/352/353 కింద నగావ్ పోలీస్ స్టేషన్‌లో కేసు (347/25) నమోదు చేసి అరెస్ట్ చేశారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(Assam CM Himanta Biswas Sharma) గౌహతిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *