జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత బంగ్లాదేశ్ సరిహద్దు(India-Bangladesh Border)లో కేంద్రం హైఅలర్ట్(High Alert) ప్రకటించింది. ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధ(India vs Pak War Situation) వాతావరణం నెలకొన్న ఈ సమయంలో బంగ్లాదేశ్, పాక్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాక్ ఐఎస్ఐ, పాకిస్థాన్ మిలిటరీ భారత్ బంగ్లా సరిహద్దుకు చేరుకుంటున్నాయి. బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పాక్ ISI, పాక్ మిలిటరీ అధికారులు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత్ పెద్ద మొత్తంలో సైన్యాన్ని మోహరిస్తున్నట్లు సమాచారం.

వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదు: అమిత్ షా
ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశతో పాటు అక్కడి రాడికల్ ఇస్లామిక్ గ్రూపులతో సంబంధాలు బలోపేతం చేసే ప్రయత్నాలను పాక్ ముమ్మరం చేసింది. యుద్ధం అనివార్యం అయితే ఇండియాను ఇబ్బంది పెట్టేలా సరిహద్దు ప్రాంతంలోని ఆ గ్రూపులను వాడుకోవాలని ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ బంగ్లా సరిహద్దుల్లో భద్రతను పటిష్ఠం చేసింది. ఇదిలా ఉండగా పహల్గామ్ దాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఇవాళ మరోసారి హెచ్చరించారు.








