నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్(Hit 3: The Third Case)’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శైలేష్ కొలను(Director Sailesh Kolanu) డైరెక్షన్‌లో మే 1న రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్, ఆరు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి, వరల్డ్‌వైడ్ రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. నాని అర్జున్ సర్కార్(Arjun Sarkar) రోల్, అడివి శేష్ కామియో సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమా యూత్, మాస్ ఆడియన్స్‌ను ఆకర్షించి, టాలీవుడ్(Tollywood)లో కొత్త జోష్ తెచ్చింది.
నాని కెరీర్‌లో మరో రికార్డు
సినిమా రిలీజైన తొలి వీకెండ్‌లో హైదరాబాద్(Hyderabad), తెలంగాణ(Telangana)లో హౌస్‌ఫుల్ షోలతో దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh)లో మొదటి వారం టికెట్ ధరలు(Ticket Rates) సింగిల్ స్క్రీన్‌లలో రూ.50, మల్టీప్లెక్స్(Multiplex)లలో రూ.75 అదనంగా పెంచుకునే అనుమతి లభించింది. ఈ ధరలతో రిలీజైన సినిమా, యూత్, మాస్ ఆడియన్స్ సపోర్ట్‌తో భారీ కలెక్షన్స్ రాబట్టింది. నార్త్ USలో కూడా $2 మిలియన్ (రూ.16.8 కోట్లు) మార్క్‌ను దాటి, నాని కెరీర్‌లో మరో రికార్డు సృష్టించింది.
కలెక్షన్స్ పెరిగే అవకాశం
ఇప్పుడు APలో ‘హిట్ 3’ టికెట్ ధరలు సాధారణ స్థాయికి తగ్గాయి. మే 8 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.145, మల్టీప్లెక్స్‌లలో రూ.177గా నిర్ణయించారు. మొదటి వారం ధరలు పెంచుకునే అనుమతి ముగియడంతో ఇప్పుడు ఈ సాధారణ ధరలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పు మరికొంత మంది ఆడియన్స్‌ను థియేటర్లకు ఆకర్షించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






