IPL 2025: ఐపీఎల్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్

ఐపీఎల్ (Indian Premier League) 2025లోని మిగిలిన మ్యాచ్‌లను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. భారత్-పాకిస్థాన్(India-Pakistan War Crisis) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు BCCI వర్గాలు స్పష్టం చేశాయి.

భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలోనే..

దేశంలో నెలకొన్న సున్నితమైన పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌(Matchs)ల నిర్వహణ శ్రేయస్కరం కాదని BCCI భావించింది. ఈ క్రమంలోనే, మే 8న ధర్మశాల వేదికగా PBKS VS DC జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. వాస్తవానికి, ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(LSG vs RCB) మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.

రేపటి మ్యాచ్ టికెట్ డబ్బులూ వాపస్

అయితే, BCCI తాజా ఆదేశాలతో నేటి నుంచి IPL మ్యాచ్‌లన్నీ తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ నిర్ణయంతో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు ఆయా ఫ్రాంచైజీలు డబ్బులను తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించాయి. మే 10వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో KKR vs SRH మధ్య జరగే కీలక మ్యాచ్‌కు టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు రీఫండ్ చేస్తోంది.

Related Posts

KCR Health Update: కేసీఆర్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?

తెలంగాణ(Telangana) మాజీ సీఎం, BRS పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం తీవ్ర అనారోగ్యానికి(Illness) గురైన సంగతి తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి(Somajiguda Yashoda Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కేసీఆర్…

Edgbaston Test: శెభాష్ శుభ్‌మన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *