టీమ్ఇండియా(Team India) మాజీ క్రికెటర్, మాజీ కోచ్, ప్రస్తుత కామెంటేటర్ రవిశాస్త్రి(Ravi Shastri) భారత ప్రభుత్వం(Indian Givt), సైన్యం(Army)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్(Pakistan)తో తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో భారత్‌ను ఓ పటిష్ఠ క్రీడా జట్టుతో పోల్చారు. ఇందులో ప్రధాని మోదీని ‘GOAT’ (Greatest of All Time) కెప్టెన్‌గా అభివర్ణించడం విశేషం. తన క్రీడా జీవితంలో ఎన్నో యునైటెడ్ జట్లను చూశానని, కానీ 150 కోట్ల మంది ప్రజలతో కూడిన ‘India United’ జట్టును చూడటం ఇదే మొదటిసారని రవిశాస్త్రి పేర్కొన్నారు.
ఇలాంటి సమష్టి స్ఫూర్తి ఎప్పుడూ చూడలేదు..
ఈ అద్భుతమైన జట్టు మన మహోన్నత సాయుధ బలగాల నేతృత్వంలో మైదానంలోకి దిగిందన్నారు. దేశాన్ని నడిపిస్తున్న ఈ జట్టుకు నరేంద్ర మోదీ(PM Modi) ప్రభుత్వం కెప్టెన్(Captain)గా వ్యవహరిస్తోందని కొనియాడారు. ఇలాంటి పటిష్ఠమైన, సమష్టి స్ఫూర్తితో ముందుకు సాగుతున్న భారతదేశాన్ని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని రవిశాస్త్రి తన మనోభావాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, దేశ నాయకత్వానికి, ప్రజల ఐక్యత(Unity)కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలుపుతూ, “జై హింద్(Jai Hindh)” అంటూ ట్వీట్ చేశారు.
I have seen many United outfits in my sporting life, but this is the first time I am seeing a 1.5 billion-strong India United take the field, led by our magnificent Armed Forces and captained by the G.O.A.T., Narendra Modi Ji and his government. Take a bow. Jai Hind 🇮🇳…
— Ravi Shastri (@RaviShastriOfc) May 9, 2025








