నేచురల్ స్టార్ నాని(Nani), KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) జంటగా, డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ ‘హిట్ 3(HIT-3)’. ఈ మూవీలో ‘అర్జున్ సర్కార్’ అనే పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా నాని కనిపించనున్నాడు. ప్రశాంతి త్రిపిర్నేని(Prashanti Tripirneni)తో కలిసి నాని ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సుమారు రూ.60 కోట్ల బడ్జెట్(Budget) కాగా రిలీజ్‌కి ముందే లాభాల్లోకి వచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి.

నిర్మాతలకు లాభాల పంట ఖాయం
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హిట్-3 మూవీ OTT Rightsను నెట్‌ప్లిక్స్(Netflix) రూ.54 కోట్లకు కొనుగోలు చేసిందట. ఆడియో రైట్స్ ద్వారా మరో రూ.6 కోట్లు వచ్చాయని తెలిసింది. ఇక్కడికే రూ.60 కోట్లు వచ్చేశాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్(Theatrical Rights)కి భారీగా డిమాండ్ ఉంది. హిందీ డబ్బింగ్ రైట్స్(Hindi dubbing rights), శాటిలైట్ హక్కులు(Satellite Rights) ఇంకా ఫైనల్ కాలేదు. వీటన్నింటి ద్వారా వచ్చే ఆదాయం నిర్మాతలకు లాభాల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎంతలేదన్నా రూ.30కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ వచ్చే అవకావాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గెస్ట్ రోల్‌లో కోలీవుడ్ స్టార్ హీరో
ఇక హిట్, హిట్ 2 చిత్రాలను మించి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ ఖాయంగా కనిపిస్తోంది. ‘హిట్ 3’ మే 1న విడుదల కానుండగా.. అప్పటికే వేసవి సెలవులు కలిసి రానున్నాయి. పైగా ఈ మూవీలో కోలీవుడ్ హీరో కార్తి(Karthi) ఓ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కార్తికి తెలుగులో మంచి మార్కెట్‌తో పాటు భారీ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ వార్త నిజమైతే మాత్రం ‘హిట్ 3’కి కచ్చితంగా ప్లస్ అవుతుందని నాని ఫ్యాన్స్ భావిస్తున్నారు.






